6 రోజుల నిరాహార దీక్ష తో మన యు. టి. ఎఫ్ అధ్యక్షులు శ్రీ N నారాయణ మరియు M L C లు లక్ష్మణ రావు మరియు శ్రీనివాసుల రెడ్డి గార్ల ఆరోగ్యము క్షీణించింది. అయినా మొక్కవోని దీక్షతో నిరాహార దీక్ష కొనసాగిస్తుండగా 5 వ రోజు రాత్రి ప్రభుత్వం అరెస్టు చేసి గాంధి ఆసుపత్రికి తరలించింది. ఆయినా నాయకులూ ఆరోరోజు కుడా దీక్ష కొనసాగించారు.ఈ రోజు 7 వరోజు దీక్ష కొనసాగుతుంది. | |
.ఉపాధ్యాయ వృత్తిలో అప్రెంటిస్ వ్యవస్థను రద్దు చేయాలి. జి.ఓ 130 ని రద్దు చేయాలని కోరుతూ నాయకుల అరెస్ట్ కు వ్యతిరేఖంగా 12-9-2011 న జిల్లా కేంద్రాలలో జరిగిన పికేటింగులో ఉపాద్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉపాధ్యయులంతా ఆందోళనను ఉధృతం చేయవలసిన పరిస్థితి. పరిస్తితులను అవగాహన చేసుకోకుండా నిర్లిప్తంగా ఉన్నవాళ్ళను మేల్కొలపండి. తెలియకుండానే ఉద్యమ ఫలితాలు అనుభవిస్తూ ఉద్యమాలను గేలిచేస్తూ మాట్లాడే దుష్టులపై / ఆత్మాభిమానం లేనివారిపై కోపం వద్దు.ప్రతి ఉద్యమం లోను అటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఆఖరికి అది స్వాతంత్ర్య ఉద్యమం అయిన సరే. ఆత్మాభిమానం తో ఉద్యోగ జీవితాన్ని గడపాలనుకొనే వారికి ఈ జి. ఓ. 130 ఒక శాపం అని ప్రతి ఒక్కరు గుర్తించాలి. కళ్ళముందే జరుగుతున్నా వెట్టి చాకిరి " అప్రెంటిస్ వ్యవస్థ" అని గుర్తించాలి. రండి. ఈ అన్యాయాలకు వ్యతిరేఖం గా పోరాడుదాం. |
suribabu pusuluri
Plot-41A,D.NO:23-22/1, Ganesh Colony,Srinivasanagar, simhachalam post, visakahapatnam-53002808912507982,9490132690